ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘మీకోసం’ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం. నవీన్‌కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అర్జీలను పరిశీలించిన అనంతరం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.