శ్రావణ సోమవారం సందడి..

మహాశివుడికి ప్రత్యేక అభిషేకాలు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: మొదటి శ్రావణ సోమవారం సందర్భంగా పెద్దపల్లిలోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్థానిక శివాలయాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మహాశివుడి దర్శనం కోసం బారులు తీరారు. ఆలయ పూజారి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో మహాశివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రావణ మాసంలోని మొదటి సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.