వ్యాపారులకు అండగా కూటమి ప్రభుత్వం..
వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరిస్తాం
శ్రీ వాసవి ఫౌండేషన్ అభినందన సభలో తేదాపా పశ్చిమ ఇన్చార్జి బుద్ధ వెంకన్న
భవానిపురం, ఆంధ్రప్రభ : తెలుగుదేశం ప్రభుత్వం వ్యాపారస్తుల సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు , పశ్చిమ ఇన్చార్జి బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు.శ్రీ వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన వివిధ సంస్థల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మరియు పాలకవర్గ సభ్యులకు అభినందన సభ జరిగింది. ఆదివారం కొత్త గుళ్ళ సమీపంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో జరిగిన అభినందన సభకు శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు సభాధ్యక్షత వ్యవహారించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెదేపా పశ్చిమ ఇంచార్జి బుద్ధా వెంకన్న హాజరై నూతనంగా ఎన్నికైన వివిధ సంస్థల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సభ్యులకు అభినందనలు తెలిపి సత్కరించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వ్యాపార,వాణిజ్య వర్గాలకు కంచుకోట లాంటిదని గుర్తు చేశారు. కాలక్రమంలో ఈ కామర్స్ (ఆన్లైన్ బిజినెస్) వ్యాపారం జోరెందుకోవడంతో స్థానిక వ్యాపారుస్తులు వ్యాపారాలు లేక ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని స్పష్టం చేశారు.

వ్యాపార వ్యాపార వర్గాలను సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వద్దకు తీసుకువెళ్లి నూటికి నూరు శాతం సమస్య పరిష్కార దిశగా కృషి చేసి తీరుతానని హామీ ఇచ్చారు . కూటమి ప్రభుత్వం వ్యాపార, వాణిజ్య వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని వెంకన్న మరోసారి స్పష్టం చేశారు . శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు మాట్లాడుతూ వ్యాపార వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉండే బుద్ధా వెంకన్న తెదేపా పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జి కావడం హర్షణీ యమన్నారు. బుద్ధా వెంకన్న వ్యాపారుల నుంచి దందాలు, చందాలు వసూలు చేసిన చరిత్ర ఎన్నడూ లేదని గుర్తు చేశారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడ అధ్యక్షులు గడ్డం బాల వెంకట రవికుమార్ మాట్లాడుతూ వ్యాపార వర్గాల సమస్యల పట్ల బుద్ధ వెంకన్న సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వాసవి ఫౌండేషన్ సహా పలువురు వ్యాపార ప్రముఖులు బుద్ధా వెంకన్నను సత్కరించారు. కార్యక్రమంలో గొల్లపూడి కమర్షియల్ మార్కెట్ అధ్యక్షులు పరుచూరి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కాసుల నారాయణ, ట్రెజరర్ నంబూరు సాంబశివరావు, ఆర్యవైశ్య ప్రముఖులు గడ్డం సత్యనారాయణ, నంబూరు ప్రదీప్ కుమార్, కెవిఎల్ గణేష్, వంకాయల , క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఓలేటి జగన్మోహన్రావు,, ఐరన్ యాడ్ అధ్యక్షులు కందుకూరి అనిల్ కుమార్, క్లాత్ ఏజెన్సీ అధ్యక్షులు ఎన్వి గుప్తా తదితరులు పాల్గొన్నారు,
