ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలి
సోమవారం ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో కార్యక్రమం..
నిర్లక్ష్యం చేస్తే నోటీసులు: ఎంపీడీవో సవితారెడ్డి
బిక్కనూరు, ఆగస్టు 16 (ఆంధ్రప్రభ): మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీడీవో సవితారెడ్డి సూచించారు.
ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులు సోమవారం ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకోవాలని ఆదేశించారు.
ప్రజల నుంచి శాఖల వారీగా స్వీకరించే ఫిర్యాదులను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాకుండా నిర్లక్ష్యం చేసే అధికారులకు నోటీసులు జారీ చేస్తామని ఎంపీడీవో సవితారెడ్డి హెచ్చరించారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు.
