ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యంకు ఉత్తమ సేవా పథకం

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: ఇబ్రహీంపట్నం సీఐ ఎ. సుబ్రహ్మణ్యంకు ఉత్తమ సేవా పథకం లభించింది. శనివారం నగరంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు సమక్షంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఆయన పథకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యంకు పలువురు అభినందనలు తెలిపారు.