డ్రై ఫ్రూట్స్ దుకాణాన్ని ప్రారంభించిన మైనార్టీ చైర్మన్

మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన డ్రై ఫ్రూట్స్ దుకాణాన్ని తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రై ఫ్రూట్స్ పిల్లలు, పెద్దల ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిపారు. ఉదయం అల్పాహారంలో భాగంగా సరైన మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు. దుకాణ నిర్వాహకుడు జమీర్ ఫుల్ హసన్‌ను అభినందించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మధుసూదన్‌రెడ్డి, కార్పొరేటర్ ఫయాజ్, ఉమర్ కొత్వాల్, అవేజ్, పీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ తదితరులు పాల్గొన్నారు.