స్వర్ణాంధ్ర విద్యార్థికి ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డు..

నర్సాపురం, ఆంధ్రప్రభ: ప్రత్యేక సమగ్ర సవరణ–2026 సామాజిక మాధ్యమాల ప్రచార కార్యక్రమంలో అత్యుత్తమ సేవలు అందించిన స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థి కార్యదర్శి జరుగు లీలా శ్రీరామ్‌కు ప్రతిష్ఠాత్మక ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డు లభించింది. భీమవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా శ్రీరామ్ అవార్డు అందుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ తనకు అవార్డు రావడానికి సహకరించిన కళాశాల చైర్మన్ కొండవీటి సత్యనారాయణ, కోశాధికారి కొండవీటి వెంకటేశ్వరస్వామి, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా. ఏ. గోపీచంద్, ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమ అధికారులు వి. మాణిక్యాలరావు, ఎం.వి. కృష్ణమోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ స్ఫూర్తితో మరిన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు.