పాఠశాలకు ప్రింటర్.. విద్యార్థులకు బ్యాగుల పంపిణీ
- మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న ఉప్పరి అశోక్ సాగర్
మక్తల్, ఆంధ్రప్రభ: మక్తల్ మండలం మంథన్ గ్రామంలో సామాజికవేత్త, బీఆర్‌ఎస్ నాయకుడు ఉప్పరి అశోక్ సాగర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.30 వేల విలువైన ప్రింటర్‌ను అందజేయడంతో పాటు 150 మంది విద్యార్థులకు పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు. అదేవిధంగా సామాన్పల్లి, ఎర్నాగనపల్లి గ్రామాల్లోని పాఠశాలల్లో చదువుతున్న 150 మంది విద్యార్థులకు కూడా బ్యాగులు అందజేశారు.
ఈ సందర్భంగా అశోక్ సాగర్ మాట్లాడుతూ గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు తనవంతు సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. గతంలో ఉన్నత పాఠశాల భవన నిర్మాణం కోసం తమ తాతలు ఎకరన్నర భూమిని ఇచ్చారని, వారి స్ఫూర్తితోనే విద్యార్థులకు చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ పాఠశాలకు, విద్యార్థులకు అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
