పాముకాటుతో రైతు మృతి..

ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : పాముకాటుకు గురై రైతు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మేడంపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఖానాపూర్ ఎస్‌ఐ రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్యా రవి (40) శనివారం పొలం పనులకు వెళ్లగా పాము కాటుకు గురయ్యాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.