ఆలేరులో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ..
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ఆర్యవైశ్య భవనం వద్ద పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి ఇరుకుల్ల రామకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బెజగం సంతోష్, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, పీఏసీఎస్ చైర్మన్ జనగాం ఉపేందర్‌రెడ్డి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు నాగబండి మధు, రాష్ట్ర కమిటీ సభ్యుడు పసుపునూరి వీరేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల సత్యం, ఆధ్యాత్మికవేత్త వంగపల్లి అంజయ్య స్వామి, సంఘం నాయకులు, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
