గురుకుల ప్రిన్సిపాల్ శకుంతలకు ఉత్తమ సేవా పురస్కారం
కడెం, ఆంధ్రప్రభ: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించినందుకు నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్లోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ శకుంతలకు ప్రశంసా పత్రం లభించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శనివారం నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వ శాసనసభ విప్ వేముల వీరేశం, నిర్మల్ ఎమ్మెల్యే ఏ. మహేశ్వర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు చేతుల మీదుగా ఆమె ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శకుంతలను సర్పంచ్ బొడ్డు స్పందన, డీసీసీ ప్రధాన కార్యదర్శి పి. సతీష్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్ గుప్తా, యూత్ కాంగ్రెస్ నాయకులు, గురుకుల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. తన సేవలను గుర్తించి అవార్డు అందించడం సంతోషంగా ఉందని శకుంతల తెలిపారు.
