SIR–2026 విజయవంతం..

  • దస్తూరాబాద్ రెవెన్యూ అధికారులకు అవార్డులు

దస్తూరాబాద్, ఆంధ్రప్రభ: దస్తూరాబాద్ మండలంలో SIR–2026 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి నిర్దేశిత లక్ష్యాలను సాధించినందుకు తహసీల్దార్ యాదవ్‌రావు, సీనియర్ అసిస్టెంట్ సంతోష్, గిర్దావర్ ఆర్థిక్‌లకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డులు అందుకున్నారు. SIR–2026లో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, సిబ్బందికి మార్గనిర్దేశం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించారు. వీరి కృషిని గుర్తించిన ఉన్నతాధికారులు అవార్డులతో సత్కరించారు. కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్థులు, పాత్రికేయుల సహకారం కీలకంగా నిలిచిందని అధికారులు తెలిపారు. అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ ఈ గౌరవం తమకే పరిమితం కాదని, SIR–2026 విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ దక్కిన గౌరవమని పేర్కొన్నారు.