అనారోగ్యంతో చేనేత కార్మికుడు మృతి…
- ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యుల వేడుకోలు..
రేగొండ, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో చేనేత కార్మికుడు మృతి చెందిన సంఘటన గోరుకొత్తపల్లి మండలం చిన్నకోటపాక గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వడ్డేపల్లి చిన్న సమ్మయ్య,అనే వ్యక్తి
చేనేత వృత్తి పై ఆధారపడి జీవిస్తున్నాడు.కాగా కొంత కాలంగా అనారోగ్య బారిన పడి కులవృత్తి చేనేత పని మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. అర్ధిక పరిస్థితి బాగోలేక మెరుగైన వైద్య చికిత్స చేయించుకోక పోవడం వల్ల శనివారం ఉదయం మృతి చెందాడు.మృతుడు సమ్మయ్యకు భార్య ఐదుగురు కూతుళ్లు ,ఒక కుమారుడు ,ఉన్నారు .నిరుపేద సమ్మయ్య ను ప్రభుత్వం ఆదుకోవాలని చిన్న కొడపాక చేనేత సహకార సంఘం చైర్మెన్ ఆడేపు.రామనాధం ,ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.
