ఆలేరు తహసీల్దారుకు జిల్లా స్థాయి అవార్డు
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులుకు భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ తహసీల్దార్ అవార్డు లభించింది. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, స్థానిక ఉద్యోగులు ఆంజనేయులును అభినందించారు.
