వైభవంగా నల్ల పోచమ్మ ఆలయ వార్షికోత్సవం
ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్ శివారులో ఉన్న శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయ 5వ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు బిక్కునూరి ఈశ్వరాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకం, గణపతి పూజ, నవగ్రహ పూజ, కాలభైరవ సహిత శీతల మూలమంత్ర హవనం, ఆలయానికి అష్టబలులు నిర్వహించారు. అనంతరం యాగ హోమం పూర్ణాహుతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీనగర్, శాంతినగర్, తిమ్మాపూర్తో పాటు పలు కాలనీల నుంచి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పలు కాలనీల పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
