ప్రభుత్వ పాఠశాల విద్యతో ప్రభుత్వ కొలువులు..
నవాబుపేట్, ఆంధ్రప్రభ : మండలంలోని లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్నకిష్టయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించిన విద్యార్థులు ఉన్నతంగా రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు. సాంకేతిక విద్యలో భాగంగా సౌజన్య, పల్లవి అనే విద్యార్థినులు టైలరింగ్‌లో లోయర్ గ్రేడ్ పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించినందుకు క్రాఫ్ట్ టీచర్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదగిరి, ఏఏపీసీ చైర్మన్ లక్ష్మమ్మ, మాజీ ఎంపీపీ శ్రీను, ఉపసర్పంచ్ బంటు పాండు, ఉపాధ్యాయులు జయరాజ్, అయ్యుబ్, రతన్‌సింగ్, సిద్ధాంతి, గాయత్రి, బాలమణి, అనురాధ, రాధిక, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
