ఉత్తమ ఉద్యోగులుగా ఆర్ఐ, సర్వేయర్‌కు అవార్డులు

  • జిల్లా చీఫ్ గెస్ట్, ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు

రేగొండ, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులకు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగుల అవార్డులు లభించాయి. జిల్లా చీఫ్ గెస్ట్ ఏన్నం శ్రీనివాస్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా వారు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. పలు రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను గుర్తించి ఈ అవార్డులను ప్రదానం చేశారు.

ఇందులో భాగంగా రేగొండ మండలంలో సాదాబైనామా, భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో పురోగతి సాధించడంతో పాటు ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేయడంలో అందించిన సేవలను గుర్తించి తహసీల్దార్ కార్యాలయ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బి. వెంకటేష్‌కు ఉత్తమ ఆర్ఐగా ప్రశంసా పత్రం అందజేశారు. అలాగే శ్రీనివాస్‌కు ఉత్తమ సర్వేయర్‌గా ప్రశంసా పత్రం అందించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ శ్వేతారావు, డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ రజాక్, రెవెన్యూ సిబ్బంది, జీపీఓలు వారిని అభినందించారు.