Breaking News| మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్..
Breaking News| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రోడ్డు ప్రమాదం కేసులో అరెస్టైన ఆయన గత 23 రోజులుగా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ కేసులో విచారణ అనంతరం సోంపేట అడిషనల్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సీదిరి అప్పలరాజుకు ఊరట లభించింది. జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైంది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఆయనను జిల్లా జైలుకు తరలించారు. ఇక బెయిల్ మంజూరుతో ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
