రానున్న 2–3 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో పలు ప్రాంతాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 2–3 గంటల్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తాజా వాతావరణ సమాచారం సూచిస్తోంది.
హైదరాబాద్‌లోనూ వర్ష సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ ప్రాంతాల్లో రానున్న 1–2 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు మరిన్ని వర్షపు జల్లులు ఏర్పడే అవకాశముండటంతో ప్రజలు ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచన.
తెలంగాణలో ఈ కాలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలకు అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆధారంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన వాతావరణ సూచనలు కూడా పేర్కొన్నాయి
