Prabhas | ‘ఫౌజీ’ కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌లో ఫుల్ హైప్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చడం ఇప్పుడు సెన్సెషన్ గా మారింది. ఎందుకంటే దాదాపు 7 ఏళ్ల తరువాత ప్రభాస్ తన ప్రొఫైల్ ఫోటోను మార్చడమే దీనికి కారణం. ఏడేళ్లుగా కొనసాగుతున్న ‘బాహుబలి’ డీపీని మార్చి, ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాలోని తన కొత్త లుక్‌ను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టారు. ఎలాంటి పెద్ద ప్రకటన లేకుండానే ప్రభాస్ చేసిన ఈ చిన్న మార్పు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
అయితే, ప్రభాస్ సోషల్ మీడియాలో చాలా పరిమితంగా వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు. ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సినిమా అప్డేట్లు కనిపించినప్పటికీ, ప్రొఫైల్ పిక్చర్ మాత్రం చాలా కాలంగా మారలేదు. ‘బాహుబలి’ తర్వాత ఆయనకు వచ్చిన గ్లోబల్ గుర్తింపును ప్రతిబింబించే ఫొటోనే ఇన్నాళ్లూ డీపీగా కొనసాగించారు.
ఇప్పుడు ఏకంగా ఏడేళ్ల తర్వాత ఆ ఫొటోను మార్చి ‘ఫౌజీ’ లుక్‌ను పెట్టడంతో ఈ మార్పు సాధారణ సోషల్ మీడియా అప్డేట్ కంటే ఎక్కువగా చర్చకు వచ్చింది. కొత్త డీపీలో కనిపిస్తున్న లుక్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించింది. ఈ ఫోటోను ఇప్పటికే చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ ఒక్క లుక్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్టార్ తో హనులాంటి దర్శకుడు సినిమా అంటే.. ప్రేక్షకుల ఆలోచన వేరేలా ఉంది. కానీ ఈ ఫోటో లుక్ విడుదల చేసిన తరువాత సోషల్ మీడియా షేక్ చేశాడు.
డీపీ మార్పుతో మరింత హైప్
ప్రభాస్ ఒక్క ప్రొఫైల్ ఫొటో మార్చడం కూడా అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. అభిమానులు కొత్త డీపీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభాస్ కొత్త లుక్‌పై స్పందిస్తున్నారు. అయితే ఈ డీపీ మార్పు వెనుక ప్రభాస్ స్వయంగా ఏదైనా ప్రత్యేక కారణాన్ని ప్రకటించలేదు. అందువల్ల ఇది ‘ఫౌజీ’ ప్రమోషన్లో భాగమేనని ఖచ్చితంగా చెప్పడం కంటే, సినిమాపై ఆసక్తిని పెంచిన ఒక ఆసక్తికరమైన అప్డేట్గా చూడాలి.
‘బాహుబలి’ నుంచి ‘ఫౌజీ’ వరకు..
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి’ కీలక మలుపుగా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆయనను తెలుగు హీరో స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ఆ తర్వాత ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘సలార్’, ‘కల్కి 2898 AD’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ తన మార్కెట్‌ను మరింత విస్తరించారు. ముఖ్యంగా ‘కల్కి 2898 AD’ తర్వాత ఆయన తదుపరి సినిమాలపై అంచనాలు మరింత పెరిగాయి. ‘ఫౌజీ’లో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
చారిత్రక నేపథ్యం, యాక్షన్, భావోద్వేగాలు, దేశభక్తి అంశాలను మేళవించి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకుల్లోనూ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
ఏడేళ్లుగా మారకుండా ఉన్న ‘బాహుబలి’ డీపీని మార్చి ఇప్పుడు ‘ఫౌజీ’ లుక్‌ను పెట్టడం ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకమైన విషయంగా మారింది. సాధారణంగా సోషల్ మీడియాలో తక్కువగా యాక్టివ్‌గా ఉండే ప్రభాస్ నుంచి ఇలాంటి చిన్న అప్డేట్ రావడం కూడా పెద్ద వార్తగా మారడం ఆయనకున్న క్రేజ్‌ను మరోసారి చూపిస్తోంది.

