కాంగ్రెస్‌లో చేరిన వలస నేతలకు షాక్.. ప్రాధాన్యత లేక అసంతృప్తి!

  • కాంగ్రెస్‌లో వలస నేతల పరిస్థితి దారుణం
  • నిధులు, ప్రాధాన్యతపై నేతల ఆవేదన
  • పోచారం వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి అసంతృప్తి
  • దానం నాగేందర్ వ్యాఖ్యలు కలకలం
  • ఫిరాయింపుదారులకు కాంగ్రెస్ మార్క్ గుణపాఠం?
  • వలస నేతల తీరుపై సొంత పార్టీ శ్రేణుల్లో అక్కసు
  • కార్యకర్తల మధ్య పెరుగుతున్న మనోవేదన
  • ప్రజా తీర్పే తుది గుణపాఠమంటున్న విశ్లేషకులు

ఆంధ్రప్రభ న్యూస్ నెట్వర్క్ ఇన్చార్జి, హైదరాబాద్: పార్టీ మారితే పదవి, పలుకు బడి, ప్రాధాన్యం దక్కుతా యన్న ఆశతో కాంగ్రెస్ గూటికి చేరిన వలస గులాబీ నేతల పరిస్థితి పెనం నుంచి పోయిలో పడిన చందంగా మారినట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీలో చేరితే తమ రాజకీయ భవిష్యత్తుకు డోకా ఉండదని భావించిన సదరు నేతలకు, ప్రస్తుతం పార్టీలో ప్రాధాన్యత కరు వైందన్న చేదు నిజం అర్థమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా, కాంగ్రెస్లో చేరి, ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిణామాలపై ఒక్కొక్కరుగా పెదవి విరుస్తుండటం విమర్శలకు కారణమవు తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో తమకు సముచిత గౌరవముంటుం దని భావించిన వారంతా, బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీ లో తాజా పరిస్థితులకు అద్దం పడుతోంది. పదవులు, అధికారిక ప్రాధాన్యం సంగతి పక్కన పెడితే, కనీసం తమ మాటకు విలువదక్కడం లేదన్న ఆవేదన వలస నేతలను వణికిస్తోంది. ప్రజా పాలన – ప్రజా ప్రభుత్వం అంటూ ముందుకొచ్చిన కాంగ్రెస్ ఏలుబడిలో తమ అనుభవాన్ని ఉపయోగించుకుంటారని ఆశించిన నేతలకు నిర్ణయాత్మక వ్యవహారాల్లో చోటు దక్కక, అసంతృప్తిజ్వాలలను రగిలిస్తోంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చగా, కాంగ్రెస్ లో చేరిన సమయంలో ఎలాంటి పదవులు ఆశించడం లేదని చెప్పిన ఆయన.. తాజా పరిణామాల్లో మాత్రం ప్రభు త్వ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం విమర్శ లకు కారణమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో పాలనా వ్యవహారాలు, నాయకత్వం, నిర్ణయాల అమలు తీరుపై పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆనాడు బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేవిగా మారగా, నాటి వ్యాఖ్యలకు విరుద్ధంగా ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను ఏకరువు పెట్టడంతో జనం నవ్వుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దానం నాగేందర్, గతంలో కాంగ్రెస్లోకి వలసలను ప్రోత్సహిస్తూ, బీఆర్ఎస్ ఖాళీ అవుతుం దని ప్రకటించారు. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్య లు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. అయితే తాజాగా ఆయన ఎమోషనల్గా నిర్ణయం తీసుకోవ డం జరిగిందని, తన నియోజకవ ర్గానికి కనీసం రూ.5 కోట్లు కూడా తెచ్చుకోలేక పోయానంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతు న్నాయి. మాట ఏదైనా భావం ఎలా ఉన్నా వలస నేతలందరిలోనూ దాదాపు ఒకే రకమైన అభిప్రా యం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకరిద్దరు – మినహా దాదాపు అందరి మదిలోనూ అదే అభిప్రాయం ఉన్నదని, కొందరు మాత్రం ఆక్రోశం ఆపుకోలేక బయట పడుతున్నారని, కాంగ్రెస్ మార్క్ రాజకీయం ఏమిటో వారికి తెలిసొచ్చిందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్ మార్క్ గుణపాఠమే చెంపపెట్టు

గతంలో కాంగ్రెస్ పార్టీని బాధించిన ఫిరాయింపుల వ్యవహారం, అధికారంలోకి వచ్చిన అనంతరం మారిపోయిందని, హస్తం పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించిందన్న విమర్శలను ఆ పార్టీ నేతలు అంతగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కానీ ఫిరాయింపులకు తాము అండగా నిలిస్తే ఎలా ఉంటుందో ఒక హెచ్చరికగా చూపినట్లు ప్రస్తుత పరిస్థితులు రుజువు చేస్తున్నాయి. అంతేకా కుండా వలస నేతలకు ఎలాంటి ప్రత్యేక నిధులు కేటా యించక పోవడం, రాజకీయంగానూ, పాలనా పరమైన అంశాల్లోనూ వలన నేతలకు అంత ప్రాధాన్యతనివ్వక పోవడం పట్ల సర్వత్రా హర్షాతిరే కాలు వ్యక్తమవుతున్నాయి. నమ్మి గెలిపించిన కార్యక ర్తలను మోసం చేసి, అధికార వ్యామోహంతో కండు వా మార్చిన నేతలకు తగిన శాస్త్రి జరిగిందని ప్రజలు సైతం సంబురపడుతున్నారు. భవిష్యత్లో ఏదైనా ఒక పార్టీ బీఫాంపై గెలిచి, పార్టీ మారాలనే ఆలోచన వస్తే, ఆ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా

నేతల పెత్తనం ఎదురవడంతో పాటు, తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నామని సొంత పార్టీ నేతలు వాపోతున్నారు. మరోవైపు ఎన్నికల వరకు నువ్వానేనా అన్నట్లు పోటాపోటీగా ఎదురొడ్డిన వారంతా ఒకే జెండా నీడలోకి రావడం కూడా అ సహజ రాజకీయాలకు అద్దం పడుతుండటం పట్ల రాజకీయ విశ్లేషకులు సైతం పెదవి విరుస్తున్నారు. తమ సొంత ఎజెండాతో పార్టీ మారిన నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు గుణపాఠం కావాలని సామాజికవేత్తలు కోరుతున్నారు. చట్టాలు, న్యాయస్థానాల కన్నా ప్రజా తీర్పే ముఖ్యం పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో రాజ్యాంగం, చట్టాలు ఏం చెబుతున్నా, న్యాయస్థానాల్లో యథావి ధిగా జాప్యం కొనసాగుతోంది. న్యాయస్థానాల్లో జరిగే విచారణకు పూర్తి భిన్నంగా ప్రజాక్షేత్రంలో వల స నేతలు ప్రకటనలు చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చట్టం ముందు ఒకలా, ప్రజాక్షేత్రం లో మరోలా ద్వంద్వ విధానాలతో వలస నేతలు ఆడుతున్న డబుల్ గేమ్ కార్యకర్తలకు తీవ్ర మనోవేదనను మిగిలిస్తోంది. రాజకీయ విశ్లేషకులు, మేధావి వర్గాలు కూడా భారత ప్రజాస్వామ్య వ్యవస్థపైనే నమ్మకముంచి, రాజకీయ నేతలు ముందు కు సాగాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తు న్నారు. ముఖ్యంగా అవకాశవాద రాజకీయాల తో ప్రభుత్వాల అస్థిరతకు, అలజదులకు కారణమ వుతున్న వారికి, కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో బుద్ధిరావాలని, ప్రజలు కూడా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తీరుతారని, ప్రజల తీర్పును విస్మరించి, పార్టీ మారితే తాత్కాలికంగా కొంత లబ్ధి జరిగి ఉండవచ్చని, దీర్ఘకాలికంగా మాత్రం ప్రజల ఓటే ఆయుధంగా మారి, వేటు వేస్తుందనే విషయాన్ని మరచిపోవద్దని వారు సూచిస్తున్నారు.

చేసి, ప్రజల మద్దతు కూడగట్టుకొని గెలవాలని, అభివృద్ధి కోసమే రేవంత్తో దోస్తీ లేనిపక్షంలో వలస ఎదుర్కొంటున్న పరిస్థి తులే పునరావృతమవు తాయని, సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. విపక్ష నేతలు ఎమ్మెల్యేలుగా గెలిస్తే, అభివృద్ధిపై ప్రజలు కూడా అంతగా ఆశలు పెట్టుకోరని, కాకపోతే తమ పక్షాన ప్రశ్నించే గొంతుకగా సదరు ఎమ్మెల్యేలు నిలవాలని కోరుకుం టారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీ కన్నా, విపక్ష ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన సంధించే విమర్శలకే ఎక్కువ విలువ ఉంటుందని, ప్రజలను సైతం విశేషంగా ప్రభావితం చేస్తుందని వారు పేర్కొంటున్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో చేసే విమర్శల కన్నా, ప్రజా సమస్యలకే విలువ ఉంటుంద ని, బాధ్యతాయుత విపక్షంగా కనిపించాలని సామాజికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

కార్యకర్తల దుస్థితి మరీ పాపం.. రాజకీయ కుప్పిగంతుల్లో వలస నేతల తీరుతో రెండు పార్టీల కార్యకర్తలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల వెంట వెళ్లకపోతే, గెలిపించిన కార్యకర్తలపైనే కేసులు పెడుతున్న పరిస్థి తులు, వెంట వెళితే అప్పటి వరకు శత్రువులుగా భావించి, విబేధించిన సొంత పార్టీ కార్యకర్తలతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏళ్లుగా పార్టీ జెండాలు మోసి, త్యాగాలు చేసిన తాము, పార్టీ అధికారంలోకి

• కేసీఆర్ను మరిచిపోలేను ప్రభుత్వ సలహాదారు పోచారం వ్యాఖ్యలు

నిజామాబాద్, ఆంధ్రప్రభ: నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దోస్తానా చేస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహా దారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం వర్ని మండలం జాకోర గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, నియోజకవ ర్గానికి తగిన నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ తనకు అన్నం పెట్టా రని, అన్నం పెట్టిన వారిని మరిచి పోలేమని అన్నా రు. సమయం వచ్చినప్పుడు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేసిన మంచి పనులు సైతం చెబుతానని అన్నా రు. తన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నార ని అన్నారు. తాను ఉన్న ది ఉన్నట్లు మాట్లాడుతాన ని, ఇలా మాట్లాడుతుంటే తాను పార్టీ మారుతున్నా నని ప్రచారం చేస్తున్నారని అన్నారు. జాకోరాలో మహిళా సంఘం భవనాన్ని పోచారం గురువారం ప్రారంభించారు.