పేద ప్రజలకు అండగా ప్రజా ప్రభుత్వం : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ పటేల్ అన్నారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోనితన క్యాంపు కార్యాలయంలో సిరికొండ మండలం రిమ్మ గ్రామానికి చెందిన మార్సుకోల యాదవ్ రావ్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ యాదవ్ రావ్ కి అండగా ఉంటానని మాటిచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే సీఎం సహాయనిది నుండి రూ. 60 వేల చెక్కును మంజూరు చేయించి గురువారం బాధ్యత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు అత్యవసర వైద్య సేవలు అందించడంతోపాటు వారి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి ఎంతో దోహదపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రిమ్మ మాజీ సర్పంచ్ పేందూర్ అనిల్, మెస్రం హనుమంతు, నగేష్ బాధితులు పాల్గొన్నారు.