ప్రభుత్వ ఐటీఐ విజయవాడలో 99.9 శాతం సీట్లు భర్తీ

  • రెండో విడత ప్రవేశాల్లో 716 సీట్లకు 715 భర్తీ
  • విద్యార్థుల నుంచి భారీ స్పందన

విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) విజయవాడలో రెండో విడత ప్రవేశ ప్రక్రియ ముగిసే నాటికి దాదాపు అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 716 సీట్లు అందుబాటులో ఉండగా.. 715 సీట్లు భర్తీ అయ్యాయి. దీంతో 99.9 శాతం సీట్ల భర్తీ నమోదైంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ఐటీఐ విజయవాడ ప్రిన్సిపాల్‌ ఎం కె రావు వెల్లడించారు. రెండో విడత ప్రవేశాల్లో విద్యార్థుల నుంచి లభించిన స్పందనతో ప్రభుత్వ ఐటీఐలో సాంకేతిక విద్య, పారిశ్రామిక శిక్షణపై ఉన్న ఆసక్తి స్పష్టమవుతోందని అధికారులు తెలిపారు. ఒక్క సీటు మాత్రమే ఖాళీగా మిగిలింది.