ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం…

ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్న బుద్ధా వెంకన్న
50వ డివిజన్‌లో డోర్‌ టు డోర్‌ కార్యక్రమం


(భవానిపురం, ఆంధ్రప్రభ) : ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్‌లో నిర్వహించిన డోర్‌ టు డోర్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రతి ఇంటినీ సందర్శించారు. స్థానికులను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటేనే వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు అవకాశం ఉంటుందన్నారు. డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని, వారి సంక్షేమం కోసం నిరంతరం అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. 50వ డివిజన్‌ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని, ప్రజలతో నిరంతరం మమేకమై వారి అభిప్రాయాలు, అవసరాలను తెలుసుకుంటామని వెంకన్న పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

కార్యక్రమంలో 50వ డివిజన్‌ అధ్యక్షులు కుప్పుల అరుణ శ్రీ గంగాధర్‌, ఎన్టీఆర్‌ జిల్లా బీసీ కార్యదర్శి యాట్ల ప్రసాద్‌, డివిజన్‌ ప్రధాన కార్యదర్శి కాళ్ల ఈశ్వరరావు, వీర్ల వాసు, సుంకర శివ, కండుబోతు శ్రీను, రమాదేవి, మోబినా తదితరులు పాల్గొన్నారు.