వలకు చిక్కిన భారీ తాబేలు.. బరువు 20 కిలోలు!

బాల్కొండ (ఆంధ్రప్రభ): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరద కాలువ పరిధిలో శనివారం మత్స్యకారుల వలకు సుమారు 20 కిలోల బరువున్న భారీ తాబేలు చిక్కింది. యథావిధిగా చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వల వేయగా అందులో భారీ తాబేలు చిక్కడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి, తాబేలును సురక్షితంగా వారి వద్దకు అప్పగించారు.

అటవీ శాఖ అధికారులు తాబేలును పరిశీలించారు. సంబంధిత నిబంధనల ప్రకారం తాబేలును సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భారీ పరిమాణంలో ఉన్న తాబేలు వలకు చిక్కిన విషయం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.