బూదగవి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న కలెక్టర్
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బూదగవిలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు అర్చకులు ప్రకాశ్ స్వాగతం పలికి, శ్యామ్ ప్రసాద్ పేరుతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అర్చకులు కలెక్టర్‌ను సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ విశేషాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉరవకొండ తహసీల్దార్ అరుణ, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఛత్రగుడి చిరంజీవి, కమిటీ సభ్యులు మహేంద్ర గౌడ్, ఛత్రగుడి సుధాకర్, టెక్నికల్ అసిస్టెంట్ రవికుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
