ముస్లిం సంక్షేమానికి నిధులు మంజూరు.. ఘనంగా పాలాభిషేకం
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ముస్లిం సోదరుల అభ్యున్నతి, సంక్షేమం కోసం సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయించిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని)కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం మసీదు వద్ద టీడీపీ నాయకులు, ముస్లిం సోదరులు శనివారం ఘనంగా సంబరాలు నిర్వహించారు.
మండల టీడీపీ అధ్యక్షుడు భరోతు పీక్లా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ఎంపీ చిన్ని చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వారి సంక్షేమానికి అవసరమైన నిధులు మంజూరు చేయించడంలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడి అవసరమైన నిధులు తీసుకురావడంలో ఎంపీ చిన్ని చేస్తున్న కృషి నియోజకవర్గ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని నాయకులు తెలిపారు. ముస్లిం సోదరుల సంక్షేమం కోసం నిధులు మంజూరు చేయించిన ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాబా, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, షేక్ మొహిద్దీన్, మండల ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్ రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బి.భీమా నాయక్, సీనియర్ టీడీపీ నాయకుడు, జిల్లా రైతు సంఘం కార్యవర్గ సభ్యుడు పిన్నమనేని శ్రీనివాసరావు, చీమలపాడు పీఏసీఎస్ అధ్యక్షుడు బెజవాడ శంకర్, బూత్ కన్వీనర్ షేక్ కరిముల్లా, ఆర్యవైశ్య నాయకుడు దారా బుజ్జి, మైనార్టీ నాయకులు ఆదం షరీఫ్, తాజుద్దీన్, బాజీ, సత్తార్, రామోజీ, డిఫీటెడ్ ఎంపీ బాలాజీ, జానీ సాహెబ్, బెజవాడ ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం పెద్దలు, యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై ఎంపీ చిన్ని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
