పొన్నమండ లక్ష్మణస్వామి వర్మకు ఘన నివాళి

ఆంధ్రప్రభ, గుంటూరు : అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ అగ్నికుల క్షత్రియుల అభ్యున్నతికి, పేదల సంక్షేమానికి విశేష కృషి చేసిన గొప్ప సమాజ సంస్కర్త అని కొనియాడారు. ఆయుర్వేద రంగంలోనూ విశిష్ట సేవలు అందించారని, అగ్నికుల క్షత్రియులకు అధికారిక గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

వారి సేవలను భావి తరాలకు చాటిచెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, బీసీ సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.