భీమ్‌గల్‌లో న్యూ బ్రెజ్జా ఆవిష్కరణ
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్‌లోని వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్–మారుతి సుజుకి అరేనా షోరూమ్‌లో అత్యాధునిక ఫీచర్లతో కూడిన న్యూ మారుతి సుజుకి బ్రెజ్జా వాహనాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన భద్రతా ప్రమాణాలు, అత్యుత్తమ పనితీరుతో రూపొందించిన న్యూ బ్రెజ్జా వినియోగదారులకు ఉత్తమ ఎంపికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
షోరూమ్ నిర్వాహకులు మారుతి, వేణుగోపాల్ మాట్లాడుతూ అధునాతన ఫీచర్లు, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతి, మెరుగైన పనితీరుతో న్యూ బ్రెజ్జా మార్కెట్లోకి తీసుకొచ్చామని తెలిపారు. వాహనానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం వినియోగదారులు షోరూమ్‌ను సందర్శించాలని కోరారు. కార్యక్రమంలో బోదిరే స్వామి, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు అనంత్‌రావు, జేజే నర్సయ్య, కౌన్సిలర్లు సతీష్, సందీప్, అంజుమ్, నాయకులు నాగేంద్రబాబు, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు.
