Malkajgiri POCSO Case | చిన్నారిపై లైంగిక దాడి..
మల్కాజిగిరిలో కలకలం..
పోక్సో చట్టం కింద కేసు నమోదు
Malkajgiri POCSO Case | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి చిన్నారిని తీసుకెళ్లిన ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు రవికుమార్ చాక్లెట్ ఇస్తానని నమ్మించి చిన్నారిని తన వెంట తీసుకెళ్లి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం చిన్నారి ఏడుస్తూ ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీసులు వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు రవికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు.
