తెలంగాణ జర్నలిస్టుల క్రికెట్ జట్టుకు మంత్రి పొంగులేటి అభినందనలు
ఏపీలో టోర్నీ విజేతగా నిలిచిన స్పోర్ట్స్ జర్నలిస్టుల టీమ్.. కెప్టెన్ మానుకొండ రవికిరణ్‌కు ప్రత్యేక ప్రశంసలు
ఖమ్మం, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లయోలా కాలేజీ మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల జట్టుకు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు.
ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి విజయాన్ని అందించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా హెచ్‌ఎంటీవీ ప్రతినిధి మానుకొండ రవికిరణ్‌ను మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన జర్నలిస్ట్ సారథ్యంలో తెలంగాణ జట్టు అంతర్రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్‌గా నిలవడం గర్వకారణమని కొనియాడారు.
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు జర్నలిస్టుల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని, రెండు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి పేర్కొన్నారు.
భవిష్యత్తులోనూ తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
