దేశాభివృద్ధికి కలాం చూపిన మార్గం ఆదర్శం..
గుంటూరు, (ఆంధ్రప్రభ): మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతి సందర్భంగా సోమవారం గుంటూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా పార్టీ అధ్యక్షుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ… డాక్టర్ అబ్దుల్ కలాం తన జీవితాన్ని దేశ అభివృద్ధికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి. యువత కలలు కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకునేలా ప్రేరణనిచ్చిన స్ఫూర్తి ప్రదాత. కలాం ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చెందిన, జ్ఞానవంతమైన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
