ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అర్హులైన రైతులందరికీ అమలు చేయాలి

ఎమ్మార్వోకు బీజేపీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్ వినతిపత్రం

బాలనగర్, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని మండలంలోని అర్హులైన రైతులందరికీ అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్ డిమాండ్ చేశారు.

సోమవారం బాలనగర్ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేసి, మండలంలోని ప్రతి అర్హ రైతుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా గోపాల్ నాయక్ మాట్లాడుతూ, ఈ పథకం అమలుతో ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. అందువల్ల అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం ప్రయోజనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు సురేష్, బీజేవైఎం జనరల్ సెక్రటరీ భారత్ సందీప్, బీజేపీ కార్యదర్శి సాయి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.