అబ్దుల్ కలాం ఆశయాలు యువతకు స్ఫూర్తి కావాలి: చంద్రకాంత్ రెడ్డి

వర్ధంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులు

బిక్కనూర్, ఆంధ్రప్రభ : భారతరత్న, మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త దివంగత డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాంను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు.

సోమవారం మండలంలోని రామేశ్వర్‌పల్లిలో డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, డా. అబ్దుల్ కలాం దేశాభివృద్ధికి చేసిన సేవలు, యువతకు అందించిన స్ఫూర్తి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ దేశ ప్రగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చేపూరి రాణిరాజు, ఉప సర్పంచ్ గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నాగర్తి భూమ్‌రెడ్డి, పాలకేంద్రం అధ్యక్షుడు తక్కల్ల రవీందర్ రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, టెంపుల్ కమిటీ వైస్ చైర్మన్ అందె దయాకర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి, టెంపుల్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, మాజీ వీడీసీ అధ్యక్షుడు తక్కల్ల బాపురెడ్డి, వార్డు సభ్యులు చంద్రకళ, వీరేశం, శశికుమార్, కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, నాయకులు బాల్‌రెడ్డి, రమేష్, నాగరాజు, రాంలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని డా. అబ్దుల్ కలాంకు ఘన నివాళులు అర్పించారు.