పరిసరాల పరిశుభ్రతను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
మిర్యాలగూడ (ఆంధ్రప్రభ): మిర్యాలగూడ పట్టణ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజారెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని 34, 35 వార్డుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి పారిశుద్ధ్య పరిస్థితులను సమీక్షించారు. స్వచ్ఛ మిర్యాలగూడ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ చిలుకూరి బాలకృష్ణ, కౌన్సిలర్లు దైద సోముసుందర్, దైద స్వప్న, ఆర్కే, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
