బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కౌన్సిలర్ పూర్ణచారి
పరకాల (ఆంధ్రప్రభ): ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందిన కారు డ్రైవర్ తిప్పనీ శ్రీకాంత్ గౌడ్ కుటుంబాన్ని పరకాల పురపాలక సంఘం 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారి గురువారం పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో శ్రీకాంత్ గౌడ్ కుమారుడు బన్నీతో పాటు నాగపురి రమేష్, దాసరి రవి, లింగాల భద్రయ్య, ఖ్యాతం రమేష్, దాసరి రమేష్, వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
