కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్ నెగ్లిజెన్సీ ప్రదర్శిస్తోంది‌

  • దిగువ మానేరు జలాశయాన్ని సందర్శించిన కేటీఆర్

ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : మేడిగడ్డ దగ్గర లక్ష క్యూసెక్కులు వృధాగా పోతున్నా నీటిని ఎత్తి పోయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్ నెగ్లిజెన్సీ ప్రదర్శిస్తోందనీ బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దిగువ మానేరు జలాశయాన్ని స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నష్టం చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందనీ, కన్నె పల్లికి వెళ్లకుండా మమ్మల్ని అడగడుగునా అడ్డుకున్న ప్రయత్నం చేశారనీ అన్నారు.

అక్కడ నీరు వృధాగా పోతుంటే ఇక్కడ ప్రాజెక్టులు నోరెళ్ళ పెడుతున్నాయనీ ఇలాగే కొనసాగితే ప్రజలకు తాగునీటికి కూడా కష్టాలు రానున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. నీగిని ఎత్తిపోయమని కేవలం బీఆర్ఎస్ మాత్రమే మాట్లాడటం లేదని, కన్నె పల్లి పంప్ హౌస్ ఆన్ చేయమని రిటైర్ ఇంజనీర్లు కూడా చెప్తున్నారనీ అన్నారు. 93 మీటర్లు పారితే చాలు మోటర్లు ఆన్ చేయవచ్చనీ అలాంటిది 97 మీటర్ల పోతున్నా ఆన్ చేయడం లేదనీ మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా నీరు ఎత్తిపోయవచ్చనీ స్పష్టం చేశారు.

శ్రీపాద ఎల్లంపల్లిలో కూడా నీళ్లు లేవు. కనీసం అక్కడికి కూడా నీరు లేకపోతే హైదరాబాద్ కు తాగునీటి తిప్పలు తప్పవనీ..నీరిస్తే పంటకు కొనాల్సి వస్తుందని, బోనసు ఇవ్వాల్సి వస్తుందని మీరు నీరు పంపడం లేదనీ అన్నారు. హైదరాబాద్లో ఇప్పటికే ట్యాంకర్లలో నీళ్లు కొనుకుంటున్నారనీ..ఎన్టీపీసీ, జైపూర్ పవర్ ప్లాంట్లకు కూడా నీటి కొరత ఏర్పడి విద్యుత్ నిలిచిపోయే ప్రమాదం ఉందనీ హెచ్చరించారు. మా రక్తం చల్లితే పంటలు పండుతాయి అని సీఎం అంటున్నాడు. అందుకే ఈరోజు మేము చాలా చోట్ల రక్తదానం చేశారు.ఈ రక్తం తీసుకుని మా వాళ్లు సీఎం దగ్గరికి దగ్గరికి వెళ్తుంటే అరెస్ట్ చేశారు.

మా రక్తమే కావాలనుకుంటే.. మరక్తం చూస్తే మీ కళ్ళు శాంతిస్తాయి అనుకుంటే అందరం పంపిస్తాం అన్నారు. సీఎం సీఎం లాగా మాట్లాడడం లేదు. అన్ని చిల్లర మాటలేనని ఎద్దేవా చేశారు.భేషజాలకి పోకుండా రైతుల కోసం మోటర్ల ఆన్ చేయండి అని కోరారు.రిటైర్ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ కళ్ళల్లో నీళ్ళు తిరిగితే ఆయనతో ఈరోజు మాట్లాడాననీ..సీఎం మాటలతో బాధ కలిగినందుకు రాజకీయ వ్యవస్థ తరుపున నేను క్షమాపణ చెప్పాననీ , నిజాయితీగా బతికిన వాడిని నన్ను అలానందుకు” బాధపడ్డానని ఆయన చెప్పాడన్నారు. కెసిఆర్ మాకు అనుమతిస్తే మేము వెంటనే వెళ్లి మోటార్స్ ఆన్ చేస్తాం. కానీ ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆలోచిస్తున్నాడు అని..హిట్లర్ ఆదర్శం అన్నాడు కాబట్టే ఆయనకు రక్తం యాదికొస్తుందనీ అన్నారు.