మరికొన్ని రైళ్ల రీషెడ్యూల్

ప్రయాణానికి ముందు రైలు వివరాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని విజ్ఞప్తి

విజయవాడ, ఆంధ్రప్రభ: మధ్య రైల్వే పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల నేపథ్యంలో దక్షిణ తీర రైల్వే పలు రైళ్ల మార్గాలను మార్చడంతో పాటు కొన్ని రైళ్లను మధ్యలోనే నిలిపివేయడం, మరికొన్నింటి ప్రారంభ స్టేషన్లలో మార్పులు చేయడం, ఒక రైలును రీషెడ్యూల్ చేసినట్లు విజయవాడ డివిజన్ అధికారులు ప్రకటించారు.

ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు సంబంధిత రైళ్ల తాజా వివరాలను పరిశీలించి ప్రయాణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది. మార్గమార్పు చేసిన రైళ్లలో చెన్నై–సీఎస్‌ఎంటీ ముంబై (22158, 22160), కోయంబత్తూరు–ఎల్‌టీటీ ముంబై (11014), చెన్నై–ఎల్‌టీటీ ముంబై (12164), తిరుచిరాపల్లి–అహ్మదాబాద్ (09420), చెన్నై–అహ్మదాబాద్ (20953), కేఎస్‌ఆర్ బెంగళూరు–జోధ్‌పూర్ (16534), భువనేశ్వర్–సీఎస్‌ఎంటీ ముంబై (11020)తో పాటు సీఎస్‌ఎంటీ ముంబై–చెన్నై (22159), ఎల్‌టీటీ ముంబై–చెన్నై (22179), సీఎస్‌ఎంటీ ముంబై–భువనేశ్వర్ (11019), అహ్మదాబాద్–చెన్నై (22920), ఎల్‌టీటీ ముంబై–చెన్నై (12163), అజ్మేర్–కేఎస్‌ఆర్ బెంగళూరు (16531) రైళ్లు ఉన్నాయి. అలాగే నాగర్‌కోయిల్–ఎల్‌టీటీ ముంబై (16352) రైలును దౌండ్ వరకు, కేఎస్‌ఆర్ బెంగళూరు–సీఎస్‌ఎంటీ ముంబై (11302) రైలును సోలాపూర్ వరకు, విశాఖపట్నం–ఎల్‌టీటీ ముంబై (18519) రైలును లోణావాలా వరకు మాత్రమే నడపనున్నట్లు తెలిపింది. సీఎస్‌ఎంటీ ముంబై–కేఎస్‌ఆర్ బెంగళూరు (11301) రైలు పుణే నుంచి, ఎల్‌టీటీ ముంబై–కన్యాకుమారి (16351) రైలు దౌండ్ నుంచి, ఎల్‌టీటీ ముంబై–విశాఖపట్నం (18520) రైలు లోణావాలా నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది.

ఇక ఎల్‌టీటీ ముంబై–విశాఖపట్నం (18520) ఎక్స్‌ప్రెస్ జూలై 6న షెడ్యూల్ ప్రకారం ఉదయం 6:55 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, ఉదయం 9:55 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి…

ప్రయాణికులు తమ రైలు తాజా స్థితిని ముందుగానే తెలుసుకుని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని దక్షిణ తీర రైల్వే విజ్ఞప్తి చేసింది.