కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ..
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని భూషి మెట్ట గిరిజన గురుకుల కళాశాలలో ఈజీఎస్ ద్వారా మంజూరైన 34 లక్షలతో ప్రహా రి గూడ (కాంపౌండ్ వాల్) సీసీ పనుల నిర్మాణానికి సోమవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమత విశ్వనాథరావు సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, సర్పంచులు కొడప ప్రకాష్, సింధూ నగేష్ తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మీ మాట్లాడుతూ.. గిరిజన బిడ్డల చదువు, భద్రతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అన్నారు.
పనులు నాణ్యతతో త్వరగా పూర్తిచేసి విద్యార్థులకుఅందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కంపౌండ్ వాల్ నిర్మాణం వల్ల బయటి వారి ప్రవేశం అడ్డుకుని విద్యార్థులకు పూర్తి భద్రత లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జై నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాత్ రావు, జై నూర్ సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్,స్థానిక సర్పంచ్ ఆత్రం సింధు నగేష్ జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంతియాజ్ లాల, ఉట్నూర్ ఐటీడీఏ ఏఈ ఇంధల్ సింగ్,కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జశోద, మండల నాయకులు ప్రజాప్రతి అధికారులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
