Mohanlal | వారసత్వంగా వచ్చాయి…
ఏనుగు దంతాల కేసులో కీలక పరిణామం
Mohanlal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఏనుగు దంతాల వ్యవహారంపై ప్రముఖ నటుడు మోహన్‌లాల్ కీలక ప్రకటన చేశారు. కేరళ అటవీ శాఖ చేపట్టిన క్షమాభిక్ష కార్యక్రమంలో భాగంగా తన వద్ద 10 ఏనుగు దంతాలు, వాటితో తయారు చేసిన 13 విగ్రహాలు ఉన్నట్లు వెల్లడించారు.
2011లో కొచ్చిలోని తన నివాసంలో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో ఏనుగు దంతాలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాలను అటవీ శాఖకు సమర్పించారు.
ఆ దంతాలు తనకు వారసత్వంగా, అలాగే బహుమతుల రూపంలో వచ్చాయని మోహన్‌లాల్ తెలిపారు. వన్యప్రాణి ఉత్పత్తుల స్వాధీనం, నమోదు వంటి చట్టపరమైన నిబంధనలపై తనకు అవగాహన లేదని వివరణ ఇచ్చారు.
ఈ వ్యవహారంలో ప్రభుత్వం కేసును ఉపసంహరించుకునేందుకు సిద్ధమైనప్పటికీ, కోర్టు ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఈ కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
