పరకాలలో కేటీఆర్ కు ఘన స్వాగతం…

  • బిఆర్ఎస్ నాయకులకు కరచలనం
  • అంబేద్కర్ విగ్రహానికి నమస్కరించిన కేటీఆర్

పరకాల, ఆంధ్రప్రభ : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు పరకాల పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం రోజు పరకాల పట్టణం మీదుగా కాళేశ్వరం పర్యటనకు వెళుతున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిఆర్ఎస్ పార్టీ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పరకాల బి ఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

పరకాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాలు అందిస్తూ శాలువాలతో సన్మానించారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి, ఏకు బొబ్బిలి, బి వినయ్, రఘుపతి, బొచ్చు చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.