విజయవాడలో మెగా జాబ్ మేళా

  • జులై 12 న నిర్వహణ
  • ఏపీఎస్‌ఎస్‌డీసీ–బీఎన్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాట్లు
  • 100కుపైగా కంపెనీలు..వేల ఉద్యోగాలు..
  • రూ.12 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం

విజయవాడ, ఆంధ్రప్రభ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ , బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా జూలై 12న విజయవాడలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు.

విజయవాడ మొగల్రాజపురంలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జూలై 12 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. బీఎన్‌ఐ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 100కుపైగా కంపెనీలు, అందులో పలు బహుళజాతి సంస్థలు పాల్గొననున్నాయి. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు పాల్గొనవచ్చు.

ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనంతో ఉద్యోగాలు లభిస్తాయి. అభ్యర్థులు ముందుగా నైపుణ్యం పోర్టల్‌లో నమోదు చేసుకుని, రెజ్యూమే, ఆధార్, పాన్ కార్డు, విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో జాబ్ మేళాకు హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు. మరిన్ని వివరాలకు 83339 08080, 90326 33548, 99857 59304 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.