మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత..
కేసముద్రం, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం విలేజ్ లో ఉట్కూరి శ్రీనివాస్ ఇటీవల మృతి చెందారు.ఈనేపధ్యంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు కేసముద్రం విలేజ్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్థిక సహాయం అందజేశారు. సంఘం తరపున రూ.10,000, సంఘ సభ్యులు తమ వంతు సహాయంగా రూ.29,000 అందించడంతో మొత్తం రూ.39,000లను కుటుంబ సభ్యులకు అందజేసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం విలేజ్ గౌడ సంఘం అధ్యక్షుడు రడం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కదిర శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి పెద్దగోని సురేందర్ గౌడ్ , సంఘ సభ్యులు రడం వెంకన్న, రడం చిన్న వెంకన్న, చిర్ర యాకాంతం గౌడ్, ఉట్కూరి అశోక్ గౌడ్, కొత్త శ్రీనివాస్ గౌడ్, చింతనూరి సతీష్ గౌడ్, దొనికల రాజు, కదిర చక్రపాణి, రడం నారాయణ, రడం రామచంద్రు, ఉట్కూరి రాజు, సుదగాని సతీష్ గౌడ్, అబ్బగోని యాకయ్య, బైరు వెంకన్న, ఉట్కూరి రవిశంకర్, కదిర సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
