వనభోజనాల వేళ యువతకు ప్రత్యేక కానుక

  • గ్రామ ఐక్యతకు ప్రతీకగా టీ-షర్టుల పంపిణీ

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : తొలకరి జల్లులతో ప్రకృతి పచ్చదనాన్ని సంతరించుకున్న వేళ భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామంలో ఏటా నిర్వహించే వనభోజనాల సందడి ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామ యువతలో ఐక్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో గ్రామ కమిటీ అధ్యక్షుడు మర్రి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు లోగోతో రూపొందించిన 100 టీ-షర్టులను యువతకు పంపిణీ చేశారు.

గ్రామంలో వనభోజనాలకు వెళ్లే యువత ఒకే తరహా దుస్తుల్లో పాల్గొనడం ఆనవాయితీగా మారిందని, గత ఏడాది ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఈసారి కూడా కొనసాగించామని నిర్వాహకులు తెలిపారు. గ్రామ యువత ఉత్సాహంగా టీ-షర్టులు స్వీకరించి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఐక్యత, స్నేహభావం మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టీఏ సభ్యుడు సుంకరి రాంచంద్రయ్య, నాయకులు రాంనేని రవీందర్, సర్పంచ్ పాల్తియా సతీష్, శ్రీపతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.