Kidnaps-Girl-Orphan : అనాథగా ఇంట చేరి Andhra Prabha Crime Story

Kidnaps-Girl-Orphan : అనాథగా ఇంట చేరి Andhra Prabha Crime Story

  • చెల్లెమ్మ అపహరణ
  • ఇది తిరుచానూరు మాయలోడి దగా
  • పూతల పట్టులో కలకలం
  • చిత్తూరు జిల్లాలో తీవ్ర సంచలనం
  • ఈ .జంట కోసం పోలీసుల జల్డెడ

( పూతలపట్టు , ఆంధ్రప్రభ)

Kidnaps-Girl-Orphan : తానొక బికారి అని, తనకు తల్లి దండ్రి లేరని, తనకు అన్నం పెడితే చాలు తాను కష్టపడి పని చేస్తానని ఓ దంపతులను దగా చేసి.. ఆ బార్య భర్త కన్నబిడను అపహరించిన ఓ మాయలోడు కథ వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. పూతలపట్టు మండలం వావిల్ తోట పంచాయతీ నొ చ్చుపల్లి గ్రామానికి చెందిన రాజు. రవళి బాతులు మే పుతూ జీవనం సాగిస్తున్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరు సమీసంలోని ఎన్టీఆర్ కాలనీ కి చెందిన భాను అనే యువకుడు మూడేళ్ల కిందట నోచ్చుపల్లి గ్రామానికి వచ్చాడు. తనకు తల్లిదండ్రులు లేరని తాను అనాథ అని, మూడు పూటలు అన్నం పెడితే మీతోనే ఉండి, బాతులు మేపుతాననిఆ భార్యభర్తలను వేడుకున్నాడు. అతని మాటలు నమ్మి తమ కుటుంబ సభ్యుడిగా చేర్చుకున్నారు. అతనిని బాగా ఆప్యాయంగా చేరదీశారు. ఈ దంపతుల కుమార్తె దీప్తిని చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ చవువుగా వ్యవహరించటంతో రించటంతో భాను మాటలను నమ్మారు. ప్రస్తుతం దీప్తి వావిల్ తోట ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో గత నెల 17వ తేదీన దీప్తి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో భాను దీప్తిని తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో దీప్తి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు ఈ జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తన కూతుర్ని అతడు ఏం చేశాడోనని ఆ తల్లిదండ్రులు విలేకరుల ముందు బోరున విలపించారు.