ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని కాపాడిన పోలీసులు

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ యువతి ప్రాణాలను కడెం పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్, హోంగార్డు అప్రమత్తతతో కాపాడారు. శనివారం ప్రాజెక్టు వద్ద పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నేరెళ్ల వంశీ, హోంగార్డు లక్ష్మీనరసయ్య అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ యువతిని గమనించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

ఆ యువతి జగిత్యాల జిల్లాకు చెందినదిగా గుర్తించారు. ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రాజెక్టు వద్దకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కడెం పోలీస్ స్టేషన్ ఎస్‌ఎస్‌ఐ సాయి కిరణ్ యువతికి కౌన్సెలింగ్ నిర్వహించి, మానసిక ధైర్యం చెప్పారు. అనంతరం ఆమెను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.