పెద్దపల్లిలో దొంగల హల్ చల్..
- మినీ ట్యాంక్ బండ్ ప్రాంతంలో 3 చోట్ల చోరీ
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లిలో దొంగలు హల్ చల్ సృష్టించారు. మినీ ట్యాంక్ బండ్ ప్రాంతంలో 3 చోట్ల చోరీకి పాల్పడ్డారు. ఎల్లమ్మ చెరువు వద్ద కట్ట మైసమ్మ ఆలయంలో హుండీ పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. కట్టపై అన్న కంటైనర్ దుకాణం పగులగొట్టి సామగ్రి దోచుకెళ్లారు. కట్ట సమీపంలోని మరో కిరాణా దుకాణం తాళం పగులగొట్టి సామాగ్రి, కొంత నగదు అపహరించారు. ట్యాంక్ బండ్ ప్రాంతంలో విద్యుత్ దీపాల వెలుగులు ఉన్నా కూడా గుర్తు తెలియని వ్యక్తులు దర్జాగా దొంగతనానికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. సంఘటనా ప్రాంతాలను పెద్దపల్లి పోలీసులు సందర్శించి ఘటనలపై ఆరా తీశారు. కట్ట మైసమ్మ ఆలయాన్ని కమిటీ సభ్యులు సందర్శించి పరిశీలించారు.
