వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నాలుగో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శాంతిపాఠం, ద్వారపూజ, మూర్తి కుంభారాధన హోమం, నిత్య పూర్ణాహుతి వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహా అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ దాత ఎగమాటి అరుణ రాంరెడ్డి, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు సోలిపురం చంద్రారెడ్డి, అధ్యక్షుడు ముప్ప వెంకట్ రెడ్డి, మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, బద్ధం రాంరెడ్డి, ఉపాధ్యక్షులు ఏలే ఉప్పలయ్య, దామెర స్వాతి, ప్రధాన కార్యదర్శి గుండా మల్లేశం, కోశాధికారి ఆమనగంటి వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి ముప్ప తిరుమల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు మొగుల్లపల్లి సోమయ్య, గుండ బాలాజీ, ఫైళ్ల పుష్పలత, మర్రి జయశ్రీ, పులిపాటి సత్యవతి, గడ్డమీది రమేష్, గట్టు వెంకటేశ్వరరావు, బుడ్డి వెంకటేశ్వరరావు, మిట్టపల్లి నగేష్, సోమ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
