బాధిత కుటుంబాలను పరామర్శించిన వేముల ప్రశాంత్ రెడ్డి

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం భీంగల్ మండలంలోని పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మండలంలోని రహత్‌నగర్ గ్రామానికి చెందిన దొంతుల నరసయ్య సోదరుడు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. అలాగే ముచ్కూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఒజ్జెం భూమేష్ నానమ్మ మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.

అనంతరం జగిర్యాల్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ సంఘం రాజేశ్వర్ ఇటీవల కాలు విరిగి చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండటంతో ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

భీంగల్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ముజ్జు కుటుంబంలో ఆయన అన్నకూతురు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మాజీ జెడ్పీటీసీ చౌటుపల్లి రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.