ఎన్టీఆర్ భరోసాతో ప్రతీ గడపలో ఆనందం…

ప్రతీ కుటుంబానికీ బాబు భరోసా!
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం!
మాటలతో కాదు, చేతలతో నమ్మకం గెలుచుకుంటున్నాం
విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని)

భవానిపురం, ఆంధ్రప్రభ : పేద, బలహీన వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాధ్ (చిన్ని) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ పథకం ద్వారా ప్రతి అర్హుడికి గౌరవప్రదంగా పింఛన్ అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 51వ డివిజన్ రాజా హైస్కూల్ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు.

అనంతరం లబ్ధిదారులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసాతో ప్రతి గడపలో ఆనందం,ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తున్నామన్నారు. సంక్షేమం అంటే ప్రచారం కాదనీ,బాధ్యత అని తెలిపారు. ప్రజల చెంతకు చేరినప్పుడే సంక్షేమానికి నిజమైన విలువ ఉంటుంది” అని అన్నారు. ప్రజల ఆశీర్వాదం, నమ్మకమే తమకు అతిపెద్ద బలమని పేర్కొంటూ, “ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే మా రాజకీయానికి అర్థం అని చెప్పారు.మాటలతో కాదు, చేతలతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నామని పేర్కొన్నారు..

ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రతి ఇంటి ముఖంలో చిరునవ్వు తీసుకురావడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని చిన్ని స్పష్టం చేశారు. ప్రజల ప్రేమాభిమానాలు తమపై మరింత బాధ్యతను పెంచుతున్నాయన్నారు. “తన పై ఆశీర్వాదం ఉన్నంత వరకు ప్రజాసేవలో నా స్పీడ్ తగ్గదనీ, ప్రజల కోసం ప్రజల మధ్యే ప్రజలతోనే తన ప్రయాణం నిరంతరం కొనసాగుతుందని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీ కేశినేని చిన్ని పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ గడప వద్దకే చేరుతున్నాయని వారు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో , వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ & పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు మల్లె ఈశ్వర,రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యాదర్శి ఎండీ ఫతుల్లాహ్, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సుఖాసీ కిరణ్, దుర్గ గుడి ధర్మకర్త మండలి సభ్యులు సుఖాసీ సరిత,శాప్ డైరెక్టర్ సంతోష్,జిల్లా కార్యదర్శి పిళ్ళా శ్రీను, బంక నాగమణి,పశ్చిమ నియోజకవర్గం మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఎండీ ఆన్సర్,ఐటీడీపీ చైతన్య,కుంచం బాలకృష్ణ,క్లస్టర్ సుబ్బారావు,క్లస్టర్ సుబ్బారెడ్డి, క్లస్టర్ ప్రభు దాస్,కో- క్లస్టర్ గంగాధర్,డివిజన్ ప్రెసిడెంట్లు ఎండీ జాహిద్,బెవర జోగేష్,నవిరి మహేష్,శ్రీరామ్,మహాబి,మల్లేశ్వరి,చిన్ని ,స్థానిక కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పెద్ద సంఖ్యలో పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.